2016లో అనారోగ్యంతో మరణించిన ఓ యువకుడు.. తాను మరణించిన రెండేళ్ల తరువాత అంటే 2018లో ఇద్దరు కవలలకు జన్మనిచ్చాడు. దీనికి ప్రధాన కారణం..ఆ యువకుడి వీర్యాన్ని భద్రపరచడం, దాన్ని సరోగసీ రూపంలో మరో మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టడం. ఆ వీర్యంతో సరోగసీ రూపంలో గర్భం దాల్చిన ఆ మహిళ రెండురోజుల కిందట కవలలకు జన్మనిచ్చింది. వైద్యరంగంలో అనేక అద్భుతాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. సరికొత్త ప్రయోగాలకు ఎప్పటికప్పుడు నాంది పలుకుతూనే ఉంటారు. ఇది కూడా అలాంటి ఘటనే. మహారాష్ట్రలోని పుణేలో చోటు చేసుకున్న ఘటన ఇది. పుణేకు చెందిన ప్రథమేష్ పాటిల్ అనే యువకుడు అత్యంత ప్రతిభావంతుడు. ఉన్నత విద్య కోసం 2013లో జర్మనీకి వెళ్లాడు. అవివాహితుడు. అక్కడ చదువుకుంటుండగానే అనారోగ్యానికి గురయ్యాడు.అతనికి కేన్సర్ అని తేలింది.
దీనితో అతనికి జర్మనీలోనే కీమోథెరపీ చేశారు. కీమోథెరపీ చేయించుకుంటే చికిత్స కారణంగా ప్రథమేష్ వీర్యకణాలు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతాయని స్పష్టం చేశారు. అప్పటికీ అతనికి పెళ్లి కాకపోవడం వల్ల ముందుజాగ్రత్తగా కీమోథెరపీ కంటే ముందే వీర్యం శాంపిళ్లను తీసుకుని, భద్రపరిచారు.కేన్సర్‌తో ప్రథమేష్ 2016లో మరణించాడు. తమ కుమారుడి వీర్యాన్ని జర్మనీలో భద్రపరిచారనే విషయం పుణేలో ఉన్న అతని తల్లిదండ్రులకు తెలుసు. దీనితో వారు.. ఆ వీర్యాన్ని పుణేకు తెప్పించారు.పుణేలో ఉన్న సహ్యాద్రి ఆసుపత్రిలో
వాటిని భద్రపరిచారు. తమ దూరపు బంధువుల కుటుంబంతో చర్చించారు. తమ కుమారుడి వీర్యాన్ని ఆ కుటుంబానికి చెందిన మహిళ అండాన్ని స్వీకరించారు.ప్రథమేష్ వీర్యం, ఆ మహిళ అండాన్ని తన గర్భంలో ఉంచుకోవటానికి ప్రథమేశ్ తల్లి రాజశ్రీ సోదరి గర్భంలో ప్రవేశపెట్టారు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు నిర్వహించారు. సోమవారం ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. దీనితో.. తమ కుమారుడే మళ్లీ జన్మించినట్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రథమేష్ తల్లిదండ్రులు...