పులిని కిలో మీటర్ దూరం నుండి చూస్తేనే మనకి భయం .. అంతెందుకు ఫలానా చోట పులి తిరుగుతుంది అంటేనే ఇంకా మనం ఆ పక్కకు వెళ్ళే సాహసం చేయం.. అలాంటిది చిరుతకి ఎదురెళ్ళడం అంటే మాములు విషయం కాదు.. పక్కవాళ్ళ ప్రాణాలు పోయిన పర్వాలేదు ముందు మన ప్రాణాలు కాపాడుకుంటే చాలు అనుకుంటాం..
కానీ ఇక్కడ ఓ ఈ రైతు ఆలా ఆలోచించలేదు..తన ప్రాణం అయిన ఆవు కోసం తన ప్రాణాలకు తెగించి మరి చిరుత మీద దూకాడు..మట్టు పెట్టాడు..అదీ అతనేదో కొర్రాడు అనుకోకండి.. అతని వయస్సు 60 పైనే.. ఇది కధ కాదు నిజంగా జరిగిన సంఘటన.. ఈ ఘటన చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు న ఉన్నమహారాజ కడై గ్రామం లో చోటుచేసుకుంది..
వివరాల్లోకి వెళితే ... ఈరోజు ఉదయం కృష్ణ మూర్తి అనే 62 ఏళ్ల రైతు అవుల్ని మేపుతున్న సమయంలో అమాంతంగా ఓ చిరుత పులి ఆవు పై దాడి చేసింది... అది గమనించిన రైతు పారిపోకుండా వెంటనే తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆ చిరుత పై వూరికాడు.. తన చేతిలో ఉన్న కత్తితో చిరుత తో పోట్లాడాడు.. ఈ వేటలో చిరుత పంజాతో రైతును కొట్టినా ...
అతను మాత్రం వెనక్కి తగ్గలేదు.. చిరుత మీద దాడి చేసి దాని ప్రాణాలు తీశాడు..చిరుత దాడిలో గాయపడ్డ రైతును గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు.. రైతు కృష్ణ మూర్తి సాహసాన్నీ గ్రామస్తులు అభినందించారు.. కానీ వన్య ప్రాణాల చట్టాన్ని ఉల్లంఘించి చిరుతను చంపినందుకు అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు...