ఒక మహిళ కట్నం కోసం, మగాడిలా నటించి అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టింది... పెళ్లైన తర్వాత కట్నం తెమ్మని తీవ్రంగా వేధించడంతో పోలీసులకు చిక్కి, ఇప్పుడు ఊచలు లెక్కబెడుతోంది. ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కృష్ణా సేన్ అలియాస్ స్వీటీ సేన్‌ను గురువారం అరెస్ట్ చేసినట్లు నైనితాల్ ఎస్పీ జన్మేజయ్ ఖండూరి తెలిపారు. మగాడి రూపంలో ఫేస్ బుక్ లో అమ్మాయిలకు వలవేసి, వాళ్లను పెళ్లి చేసుకుని, కట్నం గుంజే ప్లాన్లు వేస్తుందని ఎస్పీ తెలిపారు. అనుకున్నదె తడవుగా స్వీటీ సేన్ 2013లో పెరు మార్చుకుని కృష్ణా సేన్ పేరుతో ఒక నకిలి ఫేస్ బుక్ అకౌంట్ ను స్టార్ట్ చేసింది. మగాడిలా అమ్మాయిలతో
ఛాటింగ్ చేసేది. ఆ క్రమంలో 2014లో ఫేస్ బుక్ లో ఫ్రెండ్ అయిన ఒక మహిళను వలలో వేసుకుని, పెళ్లి చేసుకునేందుకు ఒప్పించి, కాత్ గోడమ్ ప్రాంతానికి వచ్చింది. అలీగఢ్‌లో వాస్తవ్యుడైన ఓ సీఎఫ్‌ఎల్ బల్బ్ తయారీదారుడి కొడుకునని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఇక ఆ తర్వాత ఆమెను టార్చర్ చేయడం మొదలుపెట్టింది. ఫ్యాక్టరీ నిర్మాణం కోసమంటూ దాదాపు ఎనిమిదిన్నర లక్షలు ఆ అమ్మాయి నుంచి వసూలు చేసింది. ఈమెతో ఇలా ఉంటూనే, 2016లో కాలాధుంగి ప్రాంతానికి చెందిన మహిళను కూడా ట్రాప్ చేసి
పెళ్లి చేసుకుంది. అయితే సేన చేసుకున్న మొదటి పెళ్లిలోనే, రెండో భార్య అతిధిగా వచ్చింది... మగాడు కాదని రెండో భార్య పసిగట్టినప్పట్టికీ, డబ్బులు ఇస్తానని చెప్పి, ఆమె నోరు మూయించింది. ఈలోపే మొదటి భార్య కట్నం వేధింపుల కేసు పెట్టడంతో, సేనను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమె చెప్పిన విషయాలు విని అవాక్కయ్యారు. మరి భార్యల వద్ద మగాడిగా దొరక్కుండా శృంగారం ఎలా చేశావు అని అడిగితే, సెక్స్ టాయ్స్ ను ఉపయోగించి, వారికి డౌట్ రాకుండా మ్యానేజ్ చేశానని చెప్పడం విశేషం. పోలీసులు ఆమెకు మెడికల్ టెస్టులు చేయించి మహిళగా తేల్చారు.