మహారాష్ట్రలోని నందూర్బార్ రైల్వేస్టేషన్ లో సోమవారం ఓ వ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మా హత్య చేసుకునే ప్రయత్నం చేసాడు. అంతా అనుకున్నట్టే ట్రైన్ కింద పడుకొని ఉండగా అతని మీద నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది. దీంతో శరీరం కాస్త రెండు ముక్కలయింది. ఆయినా సరే ఆయన బ్రతికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు...
సంజూ అనే కుర్రాడు మాలివాడ ప్రాంతంలో ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తుండేవాడు. అయితే ఎం అయిందో తెలీదు గాని ఆయన ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు . అలాగే రైల్ ట్రాక్ పై అడ్డంగా పడుకున్నాడు.. రైల్ అతని శరీరంపై నుండి వెళ్లిపోవడం తో అతని శరీరం రెండుగా చీలిపోయింది.. అయితే రెండు గా విడిపోయినా కూడా ఇంకా బ్రతికుండడం.. పైగా తన చేతుల సాయంతో పైకి
లేవడం చూసి అక్కడి వారు ఆశర్యపోయారు..బ్రతికించమని ఆర్తనాధాలు చేశాడు..అలాగే పోలీసులు వచ్చేసరికి ఈయన చేతులు పైకి లేచి ఉండడంతో వారు కూడా ఆశ్చర్యనికి గురయ్యారు...వెంటనే ఆయన పేరు తెలుసుకున్నారు . దీంతో ఆయన గురించిన వివరాలు కొన్ని చెప్పాడు. అయితే ఆయన్ను బ్రతికిద్దామని చూసిన వాళ్ళకి నిరాశే ఎదురయ్యింది...
అప్పటికే చాలా రక్తం పోవడం తో ఆయన సంఘటన జరిగిన సుమారు 10 నిమిషాల తరువాత తన ప్రాణాలు విడిచాడు. చివర్లో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడని కానీ అప్పటికే ఆయన ప్రాణం పోయాయని వారు తెలిపారు. ఆయన స్నేహితులు వచ్చి అతని మృత దేహానికి దహనసంస్కారాలు నిర్వహించారు...