ఈ రోజుల్లో సొంత వాల్లనే నమ్మలేకపోతున్నాం.. అలాంటిది ఎవడో బయట వ్యక్తి వచ్చి వరుసలు కలిపి మాట్లాడినంత మాత్రాన వాడు ఏదో మంచి వాడు అనుకోవద్దు..నమ్మించి మోసం చేయడమే ఇప్పటి ట్రిక్స్.. ఇక్కడ కూడా అదే జరిగింది..ట్విస్ట్ ఏంటంటే అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన ఎస్సైపైనే దాడి చేశాడు...పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితతో అదే ఊరికి చెందిన నిందితుడు సందీప్ పరిచయం పెంచుకున్నాడు.. ఇంటికి వెళుతూ వుండేవాడు.. ఒకే ఊరు కావడంతో ఆమె కుంటుంబంతో కలిసి తిరుగుతూ ఆమెను అక్కా అని పిలిచేవాడు...ఒకసారి ఆమె కొత్తగా ఫోన్ కొనుకోవడంతో ఆమెకు జీమెయిల్, ఫేస్‌బుక్ ఖాతాలను ప్రారంభించి ఇచ్చాడు...అప్పటినుండి వాడి బుద్ది మారింది.. వాడి దగ్గర వున్న ఆమె ఫోన్ తాలూకు
ఐడీ, పాస్‌వర్డ్‌లతో ఆమె సెల్ ని హ్యాక్ చేసి బాధితురాలి కదలికలను సందీప్ తెలుసుకోవడం మొదలుపెట్టాడు. మరోవైపు ఆమె సోషల్ మీడియా ఖాతాల లాగిన్ వివరాలు కూడా తెలియడంతో ఆమె తన భర్తతో కలిసి ఏకాంతంగా దిగిన ఫొటోలను వాటి నుంచి సులువుగా దొంగిలించి వాటితో బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. వేధింపులకు తాళలేక బాధితురాలు భర్తతో కలిసి వేరే చోటుకు వచ్చేసింది. ఆయినా సరే వేధింపులు ఆపలేదు..
భర్తను వదిలేసి వచ్చేయాలనే డిమాండ్ చేశాడు. ఆమె మ వినకపోవడంతో ఆమె గురించి దుష్ప్రచారం చేయడం మరింత ముమ్మరం చేశాడు. తన కూతురిపై వేధింపులు మానుకోవాలని బాధితురాలి తండ్రివేడుకున్నా కనికరించలేదు... దీంతో బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు..దర్యాప్తు నిమిత్తం నిందుతుడు ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన ఎస్సైని తీవ్రంగా ప్రతిఘటించి ఎస్సై వాహనం కదలకుండా ముందు పడుకుని రాళ్లలతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఎస్సై ఫిర్యాదు చేయడంతో సందీప్‌పై దాడి కేసు నమోదైంది..