Ticker

6/recent/ticker-posts

తట్టుకోలేక కోసిసిన భార్య, శవాన్ని బాత్ రూంలో పూడ్చింది.. కానీ శవం చెయ్యి.. నిద్రలో?

రోజూ ఫుల్ గా మందు కొట్టి  ప్రతిరోజు వేధింపులకు గురి చేస్తున్నాడని భర్త అని కూడా చూడకుండా అతని  భార్య అతన్ని అతి కిరాతకంగా హ**త్య చేసింది.  తెలిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తోందని భయంతో భర్త శవాన్ని ఇంటి ఆవరణంలోని బాత్ రూంలో పూడ్చిపెట్టింది...కానీ ఇంతలో.. వివరాల్లోకి వెళితే ..  కర్ణాటకలోని దావణగెరె జిల్లా న్యామతి తాలుకా అరుండి గ్రామంలో నరసింహప్ప , రేణుకా దంపతులు నివాసం ఉంటున్నారు... నరసింహప్ప మందుకు భానిస అయ్యి  నిత్యం పీకలదాక మందు కొట్టి ఇంటికి వచ్చి మల్లీ  డబ్బులు ఇవ్వాలని భార్య రేణుకాను పీడించేవాడు... ప్రతీరోజూ లాగే సోమవారం రాత్రి కూడా పీకలదాక మద్యం సేవించిన నరసింహప్ప ఇంటికి వెళ్లి మళ్ళీ  డబ్బులు ఇవ్వాలని భార్య రేణుకను వేధించాడు... లేవని ఎంత చెప్పినా నరసింహప్ప మాట వినలేదు... 

సహనం కొల్పోయిన రేణుకకు  భర్తను చం**పేయాలని ఆలోచన వచ్చింది .. మద్యం మత్తులో నిద్రపోయిన నరసింహప్పను చూసిన రేణుకా వంట గదిలోకి వెళ్లి కత్తిపీట తీసుకు వచ్చి భర్త నరసింహప్ప గొంతుకోసి హ***త్య చేసింది... విషయం పోలీసులకు తెలిస్తే జైలుకు పంపిస్తారని  భయపడిన రేణుకా ఇంటి ఆవరణంలోని బాత్ రూంలోకి భర్త నరసింహప్ప శవాన్ని తీసుకెళ్లి పూడ్చి పెట్టింది...అలాగే ఇంటి ఆవరణంలో రక్తపు మరకలు శుభ్రం చేస్తున్న సమయంలో రేణుకా బంధువు ఒక్కరు అక్కడికి హటాత్తుగా వచ్చారు... రక్తపు మరకలు చూసి అనుమానం వచ్చి బాత్ రూంలోకి వెళ్ళి  చూడగా నరసింహప్ప చెయ్యి కనపడింది.. అంటే వెంటనే అక్కడ నుండి వెళ్ళి పోలీసులకు సమాచారం ఇచ్చారు...పోలీసులు వచ్చి ఆమె పై కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు