అతను వృత్తి రీత్యా చెత్త సేకరిస్తూ వుంటాడు.. వాళ్లకు చెత్త అన్నా.. రోడ్డుపై పడిపోయిన ఖాళీ బాటిల్స్ అయినా విపరీతమైన ఇష్టం... అవి కనిపిస్తే చాలు బంగారు దొరికినంత ఆనందంగా.. వాటిని అప్యాయంగా తీసుకుని సంచిలో వేసుకుని టీ మట్టుకు పైసలు సంపాదించేసి హాయిగా సిగరేటు తాగి ఏదో ఒక పక్కన పడుకుంటారు. రూపాయి అద్ద రూపాయిల కోసం సిటీ మొత్తం మురికి కాలువల వెంట, రోడ్ల వెంట మైళ్లు మైళ్లు తిరుగుతుంటారు. అలాంటి వ్యక్తులకు ఇలా వేలు దొరికితే ఏం చేస్తారు. సైలెంట్ గా నొక్కేసి సంచిలో పెట్టేసుకుని హ్యాపిగా కర్చుపెట్టుకుంటూ బ్రతుకుతారు...కానీ ఈ వ్యక్తి మాత్రం అలా చేయలేదు. ఆ దొరికిన పర్సును సమీప పోలీస్ స్టేషన్ లో ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ముంబాయిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ముంబాయిలో ఉంటున్న అక్షర మోకాసి అనే అమ్మాయి వుద్యోగం చేస్తుంది..నెలాఖరు అవ్వడంతో తన సాలరీ 33,000 తీసుకుని ఇంటికి వస్తుండగా తన పర్సు మిస్ అయింది...అయితే రైల్ లో చూసుకున్న ఆమె అక్కడ ఎంత వెతికినా దొరికలేదు... ఎంతో ఆశగా సాలరీని తీసుకున్నతనకి నిరాశ ఎదురైంది. విషయం తెలిసి ఇంట్లో వాళ్ల నుంచి చీవాట్లు పడ్డాయి...ఇంతలో పోలీసుల సహకారంతో దేవుడు లాంటి దీప్ చంద్ పర్సు తీసుకొచ్చి ఆమెకు ఇచ్చి ఆమెకు జీవితంలో మరిచిపోలేని సాయం చేశాడు... దీంతో అతని మంచితనానికి అక్షర 2500 రూపాయలు ఇచ్చి అతన్ని గౌరవించింది. పోలీసులు కూడా అతని నిజాయితీకి మెచ్చి అతన్ని సత్కరించారు...ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు కూడా వున్నారనడానికి ఇతనే ఓ నిదర్శనం..
0 కామెంట్‌లు