పీ99*రియడ్స్ అనేవి ఆడవారి విషయం ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. వారిని సమాజంలో ధైర్యంగా ఉండనీయకుండా చేస్తుంటాయి. ఇలాంటి పరిస్దితిని ఓ ఐపీయస్ అధికారి ధైర్యంగా ఎదుర్కుంది... ఆడవాళ్లందరికి ఆదర్సంగా నిలిచింది... పురుషుల్లో వచ్చే శరీర మార్పుల గురించి అంతగా పట్టించుకోని ఈ సమాజం ఆడవారి విషయంలో మాత్రం బూతద్దం వేసి చూస్తుంటాయి. ఇప్పుడు సమాజం ఆడవాళ్ల విషయం మార్పు రావలని ఆమె చేసిన పని ప్రశంసలు గుప్పిస్తున్నాయి... వివరాల్లోకి వెళితే .. మంజిత గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేరస్తులను హడలెత్తించడమే కాదు, నృత్యకారిణి కూడా..మహిళల పీ*//*రియడ్స్ పై ప్రజల ఆలోచనా తీరు మారాల్సిన అవసరముందని
మంజిత బలంగా చెబుతారు... ఈ నేపధ్యంలోనే తన జీవితంలో ఎదురయిన అనుభవం తన మాటల్లోనే…”అప్పుడు అహ్మదాబాద్‌లో నేరాలపై సదస్సులో మేము ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు యూనిఫాంలోనే కూర్చోవాల్సి వచ్చింది. ఆ సదస్సు జరుగుతున్న సమయంలో నాకు నెలసరి వచ్చింది. దాంతో నా యూనిఫాం మీద పెద్ద మరక ఏర్పడింది. నేను కూర్చున్న కుర్చీ కూడా తడిచిపోయింది. అక్కడ మహిళా అధికారిని నేనే. మిగతా వారంతా మగవాళ్లే. నేను ఎవరితో మాట్లాడాలి? వారి ముందు ఎలా నిలబడాలి? ఎలా వెళ్లాలి? ఆ సదస్సు ముగిసిన తర్వాత ప్రొటోకాల్ ప్రకారం, మేమంతా నిలబడి పై అధికారికి సెల్యూట్ చేయాలి. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.. అప్పటి దాకా నెలసరి అంటే అందరికీ చెప్పే విషయం కాదన్న అభిప్రాయం ఉండేది. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆ సమయంలో మాత్రం ఇబ్బందిగా అనిపించింది. ఒకవేళ నేను నిలబడితే, నా వెనక
ఉన్నవాళ్లంతా ఆ మరకను చూస్తారని అర్థమైంది. అయినా సరే, నిలబడాలని నిర్ణయించుకున్నా. అంతా నా వైపుగా చూసి నవ్వికున్నా నా డ్యూటీని నేను చేయాలని అనుకుని లేచి నిలబడ్డాను అలాగె మా పై అధికారికి సెల్యూట్ చేశాను. నేను వెళ్లేవరకూ ఎవరూ వెళ్లరని నాకు తెలుసు. దాంతో నేనే వెళ్లడం ప్రారంభించాను. అప్పుడు నా వెనుక 40 మంది మగ పోలీసు అధికారులు ఉన్నారు.. వాళ్లంతా నా వెనుక యూనిఫాం మీద ఉన్న ఆ మరకను చూశారు. ఆ మరక కనిపించకుండా డైరీ లేదా ఫైల్ అడ్డుపెట్టుకుని బయటకు వెళ్లేదాన్నే...కానీ, అలా చేయొద్దని నిర్ణయించుకున్నా...అప్పుడే మేడం మీ బట్టల మీద మరక బయటికి కనిపిస్తోంది అని నా గన్‌మెన్ చెప్పారు.. అది సహజంగా వచ్చేదే, వర్రీ అవ్వొద్దు అని అతనికి చెప్పాను. అలగె ఈ విషయంని నా క్రిన్ది అధికారులకు చెప్పాను"..అని తన జరిగిన సంగటనను గుర్తు చెసుకున్నారు.
0 కామెంట్‌లు