జంగారెడ్డిగూడెం పట్టణం అశ్వారావుపేట రహదారి సమీపంలోని మేఘన టవర్స్‌లో టి.అరుణజ్యోతి(41) ఆనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది.. అపార్టు మెంట్ లో నివసిస్తున్న వారికి ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో పోలీసులు వెళ్లగా ఇంట్లోనే శవాన్ని పెట్టుకుని, తీసుకువెళ్లడానికి వీళ్లేదని తల్లి, కుమారుడు వాగ్వాదానికి దిగారు. పోలీసుల కథనం ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలో జీలుగుమిల్లికి చెందిన టి.మంజులాదేవి (70), ఆమె కుమారుడు టి.రవిచంద్ర(39), కుమార్తె టి.అరుణజ్యోతి(41)లు జంగారెడ్డిగూడెంలోని మేఘన టవర్స్ మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారని అయిదు నెలలుగా అద్దె, కరెంటు బిల్లు కూడా చెల్లించడం లేదని అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు.
ఆర్థిక బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా? లేకుంటే ఆకలితో అలమటించి చనిపోయిందా? అనేది తెలియాల్సి ఉంది. చనిపొయిన అరుణజ్యోతి గత 5 రోజులుగా ఇంట్లోనే శవంగా పడి ఉంది. తల్లి మరియు కుమారుడికి కూడా మతి స్థిమితం సరిగ్గా లేకపోవడంతో శవం పక్కనే కూర్చుని రవిచంద్ర భోజనం చేస్తున్నాడు. తమ కుమార్తె చనిపోలేదని, నిద్రపోతుందని పోలీసులపై విరుచుకుపడ్డారు. ఒకవెల చనిపోయిన దేవుడు బతికిస్తాడు అని అప్పటివరకూ ఎవ్వరికి తమ కుమార్తెను ఇవ్వమని ఇక్కడ నుండి వెళ్లిపోవాలని పోలీసులపై కేకలు వేశారు. వైద్యులు వచ్చి ధ్రువీకరిస్తే
తప్ప నమ్మం అంటూ సోదరుడు రవిచంద్ర అనడంతో పోలీసులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి బలవంతంగా శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం నుంచి భరించలేని దుర్వాసన రావడంతో పరీక్షించడానికి పోలీసులు కూడా సాహసించలేదు. ఫిర్యాదు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వీఆర్వో నుంచి ఫిర్యాదు తీసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తామని ఎస్సై విష్ణువర్థన్ వెల్లడించినట్టు సమాచారం..