ఒడిశాలో ఒక జిల్లా అయిన భాద్రక్ జిల్లాలోని శ్యాంపూర్ గ్రామంలో వున్న ఓక ఇంట్లో 111 పాము పిల్లలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ కూలి అయిన బిజయ్ భుయాన్ ఇంటి నుంచి వీటిని రక్షించారు. ఆ 111 పాముల వయస్సు రెండు మూడు రోజుల వయసు అని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ విశయమ్ ఆ నొట ఈ నొట తెలియడమ్తొ భుయాన్ ఇంట్లో పాము పిల్లలు చూడడానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలంతా ఆయన ఇంటి వద్దకు చెరుకున్నారు . అలాగె పెద్ద నాగుపాముల కోసం అన్వేషణ మొదలపెట్టారు. అలాగె భుయాన్ ఇంట్లో ఒక పాముపుట్ట ఉందని స్థానికులు చెపుకుంటున్నారు. అలాగె తన ఇంట్లో గతంలో కూడా చాలా సార్లు పాములను చూశామని బుయాన్ అంటున్నారు. ‘మా ఇంట్లో చాలా సార్లు పాములను చూశాం.వాటి వల్ల
మాకు సౌభాగ్యం కలుగుతుందని ఏనాడు వాటిని చంపే ప్రయత్నం చేయలేదు. అవి కూడా ఎప్పుడూ మాపై దాడి చేయలేదు. అయితే ఎన్ని పాములన్నాయో మాకు తెలీదు’ అని భుయాన్ చెప్పాడు. ఇంట్లో భుయాన్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు జీవిస్తున్నారు. శనివారం రొజున తన ఇంట్లో రెండు నాగుపాము పిల్లలు పాకుతుండటం గమనించాడు భుయాన్..దీనితొ కంగారు పడిన భుయాన్ స్థానికంగా పాములను సంరక్షించే షేక్ మీర్జాకు చెప్పాడు. అక్కడికి చేరుకున్న మీర్జా.. ఇంట్లో నేలను తవ్వారు.

కింద వందల కొద్ది పాము పిల్లలను చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఆ సమయంలో అక్కడ తల్లి నాగుపాములు లేవని మీర్జా చెప్పారు. ఫారెస్ట్ అధికారుల సాయంతో వాటిని నివాస ప్రాంతాలకు దూరంగా అడవిలోకి పంపేశారు. నాగు పాములు సాదారనంగా 20 నుంచి 40 గుడ్లు వరకు పెడతాయని వాటిని పొదగడానికి 60 నుంచి 80 రోజులు వరకు పడుతాయని స్నేక్ ఎక్స్‌పర్ట్ సుభేందు తెలిప్పారు. మరి ఇన్ని నాగుపాము పిల్లలు ఇక్కడికి ఎలా వచ్చాయో అనే విషయాన్ని అటవీశాఖ అధికారులు క్షుణ్ణంగా అన్వేషించాలని కోరారు.