అర్ధరాత్రి వరకు ఫోన్‌తోనే ఉంటుంటే తల్లికి అనుమానం వచ్చి ఒక రోజు ఫోన్‌ను చెక్ చేసింది. దానిలో ఉన్న బూతు వీడియోలు చూసి షాక్‌కు గురైంది. మందలించింది... ఆ తర్వాత కొడుకు చేసిన పనికి షాక్ అయ్యింది ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఈ విషాద ఘటన కోల్‌కతాలోని గారియాలో చోటుచేసుకుంది. గారియాలోని పంచ్‌పోటలో సత్యరంజన్, మిను దంపతులకి ఒ కిరాణా శాపు వుంది.. వీరికి ఇద్దరు కుమారులు. చదువులో చురుకుగా ఉండే సైకత్ తనకు స్మార్ట్‌ఫోన్ కావాలని తల్లిదండ్రులను కోరాడు. మంచి మార్కులు తెచ్చుకుంటే కొనిస్తాను అనడంతో జాదవ్ విద్యాపీఠ్‌లో చదువుతోన్న సైకత్ మాధ్యమిక్‌లో 83 శాతం మార్కులు తెచ్చుకున్నాడు. మాట ప్రకారం తండ్రి స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారు. వేసవి సెలవులతో ఇంటి వద్దే
ఉన్న సైకత్ 24 గంటలూ ఫోన్‌తోనే గడిపేవాడు. అర్ధరాత్రి వరకు ఫోన్‌తో ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడు.. కానీ ఇంతలా రోజూ ఏం చూస్తున్నాడు ఫోన్‌లో అనే ఆసక్తి తల్లిలో కలిగింది. రెండు రోజుల క్రితం సైకత్ ఫోన్‌ను ఆమె చెక్ చేసింది. అందులో వీడియోలు చూసి షాక్‌కు గురైంది. చిన్నపిల్లలు చూడకూడని వీడియోలు అవి. అయితే వీడియోల విషయాన్ని కొడుకు వద్ద ఆమె ప్రస్తావించకుండా రాత్రిళ్లు గదిలోకి ఫోన్ తీసుకొని వెళ్లడానికి వీళ్లేదని తల్లి మందలించి ఫోన్ కూడా లాక్కుంది. సైకత్‌ది ఏ విషయం బయటికి చెప్పని మనస్థత్వం.
మంగళవారం సాయంత్రం కూడా ఫోన్ విషయమై సైకత్‌ను తల్లీ మందలించింది. మరుసటి రొజు బుధవారం ఉదయం సైకత్‌కు ట్యూషన్ ఉండటంతో తల్లి కొడుకు గదికి వచి తలుపు కొట్టింది. ఎంత సేపటికీ సైకత్ తలుపు తెరవలేదు. లోపల గడియపెట్టి ఉండటంతో భయాందోళనకు గురైన మిను.. తలుపును పగలగొట్టి చూడగా గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న సైకత్‌ను చూసి ఆ తల్లి కుప్పకూలిపోయింది. ‘నా కొడుకును నేనే చంపుకున్నాను’ అంటూ బోరున విలపించింది. కొడుకు కోసం మిను రోదన చూసిన చుట్టుపక్కలవారు కూడా కంటతడి పెట్టుకున్నారు