Ticker

6/recent/ticker-posts

ఈ వింతజీవి: ఆ కుక్క చనిపోవడం, పశువుల గాయాలు ఎలాగంటే

ఏదైనా కొంచం వింతగా వుంటే చాలు అది సోష‌ల్ మీడియాలోకి ఎక్క‌డం, కొన్ని గంట‌ల్లోనే వైర‌ల్ గా మార‌డం జ‌రుగుతుంది. తాజాగా క‌ర్నాట‌క రాష్ట్ర మారుమూల గ్రామంలో గ్ర‌హాంత‌ర వాసి సంచ‌రిస్తుందంటూ ఫేస్ బుక్,వాట్సాప్ ల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భూమిపై గ్ర‌హాంత‌ర‌వాసులు దిగాయ‌ని,ప‌శువుల‌పై దాడి చేశాయంటూ వాట్సాప్ గ్రూపుల్లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.దీనిపై అనేక మంది అనేక రకాలుగా స్పందిస్తున్నారు.  మ‌రికొన్ని ఛాన‌ల్స్ వాళ్లు ఇది గ్ర‌హాంత‌ర‌వాసి కాద‌ని, భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని చెప్తున్నా ప్ర‌జ‌ల్లో భ‌యం మాత్రం త‌గ్గ‌డం లేదు. అసలు వివ‌రాల్లోకెళితే… కొంద‌రు యువ‌కులు కోతిని ప‌ట్టుకొచ్చి, దానికి గ్ర‌హాంత‌ర‌వాసి


మాదిరిగా మేక‌ప్ వేసి, మిగ‌తా శ‌రీర‌మంతా క‌నిపించ‌కుండా న‌ల్ల‌టి వ‌స్త్రాన్ని క‌ప్పారు. ఇక ఇక ముఖంపై పూర్తిగా తెల్ల‌టి రంగును పూసి, కోతి హావాభావాలు క‌నిపించ‌కుండా త‌యారుచేశారు. ఆ  కోతి క‌ద‌ల‌కుండా చుట్టూ మ‌నుషులు ఉండ‌టంతో ఎటూ వెళ్లలేక ఇబ్బందప‌డుతున్న దృశ్యం అక్క‌డ గమనించవచ్చు. అలాగే  ఓ యువ‌కుడు కర్ర‌ను కోతి ద‌గ్గ‌రికి తీసుకెళ్ల‌డంతో అది కూడా క‌ర్ర‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న తీరు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది..ఇక ఆ చనిపోయిన కుక్క , పశువుల పై దాడి

విషయానికి వస్తే  ఆ కుక్క పశువుల పై దాడి చేయడంతో దానిని కొట్టి చంపడం జరిగిందట...అయితే సంబందం లేని మూడు వీడియోలను ఒకే సారి షేర్ అవ్వడం వల్ల ప్రజలు నిజంగానే గ్రహాంతరవాసి అని భ్రమపడితే...మరికొందరు మాత్రం ఇదంతా ఫెక్ అని కొట్టి పారేశారు.. క‌ర్నాట‌క‌లో జ‌రిగిందో లేక‌,మ‌రెక్క‌డ జ‌రిగిందో క‌రెక్ట్ గా తెలియ‌దు కానీ, గ్ర‌హాంత‌ర‌వాసి మాత్రం కాద‌ని స్ప‌ష్టంగా తెలిసిపోతుంది. కావాల‌నే కొంద‌రు యువ‌కులు ఈ విధంగా చేయ‌డంతో దేశ‌వ్యాప్తంగా దీనిపై చ‌ర్చ న‌డుస్తోంది.అయితే, ప్ర‌జ‌లెవ‌రూ దీనిగురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు...