ఇంకా కరోన వైరస్ వ్యాప్తి కొనసాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ మరోసారి పొడిగించింది . 17 మే వరకు లాక్‌డౌన్ వున్తున్దని కేంద్ర హోం శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే లాక్ డౌన్ సమయంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సడలింపులు ఇచ్చింది. అందులో వీటికి మాత్రమే అనుమతులు వున్నవి...
అనుమతి కల్పించే అంశాలివే..
* అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి. కంటెయిన్‌మెంట్ జోన్లలో సామాజిక దూరం మొదలగు నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ కార్యకలాపాలు సాగించాలి.
* రాష్ట్రాల పరిధిలో గ్రీన్ జోన్లలో బస్సులకు అనుమతి. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే బస్సులు నడిపించాలని ఆదేశం.
* ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షల సడలింపు. వ్యక్తిగత వాహనాలకు అనుమతి. కార్లలో ఇద్దరు ప్యాసింజర్లు ప్రయాణించవచ్చు. టూ వీలర్ మీద ఒక్కరికే అనుమతి.
* ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్ సేవలు, బస్సు సర్వీసులు, సెలూన్లు, స్పా సెంటర్లకు అనుమతి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కార్యకలాపాలు సాగించాలి.
* గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి.
* గ్రీన్ జోన్లలో ఉ. 7 నుంచి సా. 7 వరకు మాత్రమె వ్యాపారాలకు అనుమతి.
* గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మకాలు సాగించాలి.
* రెడ్ జోన్లలో వారానికి ఒక్కసారి పరిస్థితిని పరిక్షించి కేసులు తగ్గిన యడల ఆరెంజ్ జోన్లుగా అలాగె ఆరెంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్పు చెస్తారు.
* గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో నిత్యావసరాలు మరియు ఔషధ రంగం మరియు వైద్య ఉపకరణలు అలాగె ఐటీ, హార్డ్‌వేర్, జ్యూట్ ఇండస్ట్రీ లకు నిబంధనలతో కూడిన అనుమతి.
* నిర్మాణ రంగంలో మాత్రమ్ కొంత మంది కార్మికులతో సామాజిక దూరాన్ని పాటిస్తూ వారి కార్యకలాపాలు కొనసాగించేలా అనుమతి.
* ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరియు కాల్ సెంటర్లు అలాగె కోల్డ్ స్టోరేజీ లకు గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో అనుమతి.