Ticker

6/recent/ticker-posts

మే 17 వరకూ లాక్ డౌన్... వీటి పై నిషేదం

ఇంకా కరోన వైరస్ వ్యాప్తి కొనసాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 17 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ శుక్రవారం (మే 1) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే లాక్ డౌన్ సమయంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సడలింపులు ఇచ్చింది. అందులో వీటికి మాత్రమే అనుమతులు వున్నవి...

వీటిపై నిషేధం కొనసాగింపు..


* విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేధం. ప్రత్యేక సందర్భాల్లో కేంద్ర హోం శాఖ అనుమతితో ఈ సేవలకు అనుమతి.
* స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌.
* హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌.
* స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు బంద్.
* ప్రజలు గుమిగూడటానికి ఆస్కారం ఉన్న అన్ని కార్యక్రమాలపై నిషేధం కొనసాగింపు. అన్ని రకాల ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు.
* రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలు. అవసరమైన చోట్ల 144 సెక్షన్ విధింపు.
* అన్ని జోన్లలో 65 ఏళ్ల పైబడిన వ్యక్తులు, పిల్లలు, గర్బిణులకు అనుమతి నిరాకరణ. ప్రత్యేక అవసరాలకు మాత్రమే బయటకు రావడానికి అనుమతి.
* కంటెయిన్‌మెంట్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదు.
* రెడ్ జోన్లలో సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్ సేవలు, బస్సు సర్వీసులు, సెలూన్లు, స్పా సెంటర్లకు అనుమతి లేదు.