ప్రస్తుత లాక్ డౌన్ వేళ కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. బండి మీద వెళ్తున్న అన్నా చెల్లెళ్ళపై దాడిచేసి అమ్మాయి అన్నని బావిలోకి తోసేసి ఆపైన ఆమెపై సామూహిక త్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.... మధ్యప్రదేశ్‌లోని పాధార్ సమీప గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి, తన
అన్నతో కలిసి రాత్రి బైక్‌పై వెళ్ళి పని చూసుకుని తిరిగి అక్కడి నుంచి ఇద్దరూ ఇంటికి బయల్దేరారు.. సడన్ గా బైక్ హెడ్‌లైట్ పాడైంది. దీంతో ఓ యువకుడు బండి ఆపి దానిని రిపేర్ చేస్తా అని చెప్పి హెడ్ లైట్ ని విప్పాడు.. కొంతసేపటికి రెండు బైకులపై మరో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. యువతి సోదరుడిపై దాడిచేసి పక్కనే ఉన్న బావిలోకి తోసేశారు. అనంతరం యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే ఉన్న మరో నలుగురితో కలిసి యువతిపై *త్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయి కేకలు పెడుతున్న వినిపించుకోకుండా ఆమెపై తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు.
బావిలోంచి ఎలాగోలా బయటపడిన అమ్మాయి సోదరుడు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు అమ్మాయి కోసం గాలింపు చేపట్టారు. ఘటన స్థలంలో అపస్మారక స్థితిలో వున్న అమ్మాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుల కోసం గాలించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తనపై ఘాతుకానికి పాల్పడిన నిందితుల్ని బాధితురాలు గుర్తించింది. పరారీలో ఉన్న మరో మగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు పోలీసులు.