Ticker

6/recent/ticker-posts

విశాఖలో ఓ జంట పిచ్చిపని…బొమ్మతో బురిడీ కొడదామనుకుని

లాక్ డౌన్ తో ఒక్కసారిగా అందరికీ కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో పడేసినట్టు అయ్యింది...కానీ కొందరయితే సాకులతో ఇంటి నుండి బయటకి వస్తున్నారు.మరీ అలా బయటకి వస్తే  పోలీసులు ఊరుకుంటారా? లాఠీలకు పని చెప్తున్నారు.. దీంతో ఇలా అయితే కాదని ఓ పిచ్చి ప్లాన్ తో ఇంటి నుండి బయటకి వచ్చారు వైజాగ్ లో ఒక జంట.. వీళ్లు వేసిన ప్లాన్ కి పోలీసులకి బుర్ర తిరిగిపోయింది. 
 

వివరాల్లోకి వెళితే విశాఖపట్నంలోని గోపాలపట్నంకు చెందిన దంపతులు బైక్‌పై బయటకు వచ్చారు .  పోలీసులు ఆపడంతో తమ బిడ్డకు సీరియస్‌గా ఉందని చెప్పారు. పోలీసులు కూడా నిజమే అనుకుని వదిలేశారు. అక్కడి నుంచి బయల్దేరి NAD జంక్షన్ వరకు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీస్లు బండి ఆపడంతో మళ్ళీ వారికి అదే స్టోరీ చెప్పారు. 

కానీ భార్యాభర్తల తీరుపై ఒక కానిస్టేబుల్‌కు అనుమానం వచ్చింది. ఒకసారి  పాప‌ను చూపించండి అంటూ మహిళ దగ్గరకు వెళ్లాడు. ముందు బిడ్డను చూపించడానికి నిరాకరించిన మహిళ, తర్వాత చూపించడంతో పోలీసులు అవాక్కయ్యారు.. అక్కడ ఉన్నది పాప కాదు బొమ్మ, పోలీసులకు మస్కా కొట్టడానికి వారు  వేసిన ప్లాన్ కి ఖంగుతిన్నారు.వెంటనే తేరుకుని సీరియస్ అయ్యేసరికి  వెంటనే మహిళ మాట మార్చేసింది. త‌మ 

బంధువు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, చూడడానికి వెళ్తున్నామని ,ఒక్కసారికి అనుమతించమని కోరింది అడిగింది మహిళ కదా పోలీసులు ఏమీ అనలేక, మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని హెచ్చరించి పంపేశారు ...