కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు సుమోటుగా విచారణ
భారత్ లొ వెస్త్ బెంగాల్ లొని కోల్కత్తాలో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసును దేశ సుప్రీం కొర్ట్ మంగళవరం సుమోటుగా స్వీకరించి, విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా, బెంగాల్ ప్రభుత్వం, కోల్కత్తా పోలీసులు, కాలేజి అధికారుల తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా, ఈ కేసులో మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ దీన్ని ఆత్మహత్యగా ప్రకటించేందుకు చేసిన ప్రయత్నంపై డీవై చంద్రచుద్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సుప్రీం కోర్టు విచారణలో, మధ్యాహ్నం 1.45 నిమిషాల నుండి 4 గంటల వరకు శవపరీక్ష పూర్తయ్యాక కూడా రాత్రి 11.45 నిమిషాలకు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ సమయమంతా కోల్కత్తా పోలీసులు, అధికారులు ఏమి చేస్తున్నారని ధర్మాసనం నిలదీశింది. మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులను గంటల తరబడి ఎదురుచూసేలా ఎందుకు చేసారని కూడా ధర్మాసనం ఘాటుగా ప్రశ్నించింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటుగా స్వీకరించిన సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులతో పాటు ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది.ఆసుపత్రిలో ఇతువంటి ఘోరం జరిగితే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఎలా ప్రకటించగలిగారు? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పోలీసులు ఈ కేసులో చేసిన చర్యలు సక్రమంగా లేవని, ఎఫ్‌ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహిళలకు పని ప్రదేశంలో భద్రతను కల్పించేందుకు జాతీయ స్థాయి ప్రొటోకాల్‌ను రూపొందించడం అత్యవసరమని ధర్మాసనం పేర్కొంది. ఇందుకోసం, సుప్రీం కోర్టు ఒక జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. హత్యాచారానికి గురైన వైద్యురాలికి మద్దతుగా, ఈ టాస్క్ ఫోర్స్‌లో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆరే సరిన్ తదితరులు సభ్యులుగా ఉంటారని సుప్రీం కోర్టు పేర్కొంది. "ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం అత్యవసరం. దేశం మరో అత్యాచారం కోసం ఎదురు చూడలేదని" సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
0 కామెంట్‌లు