ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (DCM Pawan Kalyan) కు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సెప్టెంబర్ 27న జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ (Jhanvi Kapoor) ప్రధాన పాత్రల్లో నటించిన, కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన "దేవర" (DEVARA) సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ షోలకి, టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చింది.
ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ (Single Screen)లో అప్పర్ క్లాస్ (Upper Class) టికెట్ ధర రూ.110, లోవర్ క్లాస్ (Lower Class) టికెట్ ధర రూ.60 గా, అలాగే మల్టీప్లెక్స్ (Multiplex)లో టికెట్ ధర రూ.135 వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో (G.O) కూడా జారీ చేసింది.
ఇంకా, సినిమా విడుదల రోజున ఆరు షోలు, మరియు తర్వాత తొమ్మిది రోజుల పాటు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చినందుకు, ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
జీవో జారీ చేసినందుకు, మరియు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తున్నందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
0 కామెంట్లు